Amma rAvamma | అమ్మరావమ్మ తులశమ్మ

రాగం : కళ్యాణి 
తాళం : ఖండచాపు 
Composer: త్యాగరాజ కృతి 
Language: తెలుగు
ఆరోహణ : స రి2 గ2 మ2 ప ద2 ని2 స 
అవరోహణ : స ని2 ద2 ప మ2 గ2 రి2 స

అమ్మరావమ్మ తులశమ్మ నను పాలింపవమ్మ 

సతతము పదములే నమ్మినానమ్మ    ||అమ్మ|| 

నెమ్మదిని నీవిహపరమ్ములొసగుదువనుచు 

కమ్మవిల్తుని తండ్రి కలనైన బాయడట    ||అమ్మ|| 

నీ మృదు తనువును గని – నీ పరిమళములు గొని 

నీ మహాత్వములు విని – నీరజాక్షీ 

తామరస దళ నేత్రి – త్యాగరాజుని మిత్రి 

ప్రేమతో శిరమును – పెట్టుకొన్నాడు అట    ||అమ్మ|| 


Discover more from సింధు సిరులు

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *