రాగం : పంతువరాళి
తాళం : ఆదితాళం
Composer: త్యాగరాజు
Language: తెలుగు సంస్కృతం
ఆరోహణ : స రి1 గ2 మ2 ప ద1 ని2 స
అవరోహణ : స ని2 ద1ప మ2 గ2 రి1 స
పల్లవి:
శివ శివ శివ యనరాదా..
శివ శివ శివ యనరాదా.. ఓరీ
భవ భయ బాధల నణచుకోరాదా ||శివ||
అను పల్లవి:
కామాదుల తెగకోసీ..
కామాదుల తెగకోసీ… ఓరీ
భామల పరుల ధనముల రోసీ
పామరత్వమూ……
పామరత్వమూ నెడబాసీ.. ఓరీ
పామరత్వమూ నెడబాసీ.. అతి
నేమముతో బిల్వార్చన చేసీ ||శివ||
చరణం:
ఆగమముల నుతియించీ…..
ఆగమముల నుతియించీ… ఓరీ
ఆగమముల నుతియించీ… బహు
బాగులేని భాషలు చాలించీ
భాగవతులను…
భాగవతులనూ పోషించీ.. ఓరీ
భాగవతులనూ పోషించీ.. వర
త్యాగరాజ సన్నుతుడని ఎంచీ ||శివ||
Discover more from సింధు సిరులు
Subscribe to get the latest posts sent to your email.



