VedukondAmA | వేడుకొందామా వేంకటగిరి

రాగం : జంజుటి రాగం
తాళం : ఆదితాళం 
Composer: అన్నమాచార్య కీర్తన 
Language: తెలుగు

వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని || వేడు|| 

ఆమటి మ్రొక్కుల వాడే ఆది దేవుడే 

వాడు తోమని పళ్యాల వాడే దురిత దూర్యుడే || వేడు|| 

వడ్డీ కాసుల వాడు వనజనాభుడే 

పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే  ||వేడు|| 

ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే 

వాడు అలమేల్మంగా శ్రీ వేంకటాద్రి నాథుడే ||వేడు|| 


Discover more from సింధు సిరులు

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *