రాగం : భౌళి రాగం
తాళం : ఏక తాళం, త్రిశ్ర గతి
Composer: పెద్ద తిరుమలాచార్య 1st son of అన్నమయ్య
Language: తెలుగు సంస్కృతం
ఆరోహణ : స రి1 గ2 ప ద1 స
అవరోహణ : స ద1 ప గ2 రి1 స
పల్లవి:
ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది
నిక్కము నిన్నే నమ్మితిని చిత్తంబికను – నీ చిత్తంబికను ||ఎక్కడి||
చరణం: 1
మరువను ఆహారంబును మరువను సంసార సుఖము |
మరువను ఇంద్రియ భోగము మాధవ నీ మాయ |
మరచెద సుజ్ఞానంబును మరచెద తత్త్వ రహస్యము |
మరచెద గురువును దైవము మాధవ నీ మాయ || ||ఎక్కడి||
చరణం: 2
విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు |
విడువను మిక్కిలి ఆశలు విష్ణుడ నీ మాయ |
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును |
విడిచెద నాచారంబును విష్ణుడ నీ మాయ || ||ఎక్కడి||
చరణం: 3
తగిలెద బహు లంపటముల – తగిలెద బహు బంధనముల |
తగులను మోక్షపు మార్గము – తలపున ఎంతైనా |
అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై |
నగినగి నను నీవేలితి నాకా ఈ మాయ|| ||ఎక్కడి||
|| 3-4 times నీ చిత్తంబికను(to end) ||
Discover more from సింధు సిరులు
Subscribe to get the latest posts sent to your email.


