Itti Mudduladi Baludedavadu vani

రాగం : ఆనందభైరవి 
తాళం : ఆదితాళం 
Composer: అన్నమయ్య
Language: తెలుగు
ఆరోహణ : స గ1 రి2  గ1 మ1 ప ద2 ప స 
అవరోహణ : స ని1 ద2 ప మ1 గ1 రి2 స

ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని 

పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే 

గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన

చేమ పూవు కడియాల చేయి పెట్టి

చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార

వేమరు వాపోవు వాని వెడ్డు వెట్టరే || ఇట్టి  || 

ముచ్చువలె వచ్చి తన ముంగ మురువుల చేయి

తచ్చెడి పెరుగులోన తగవెట్టి

నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార

వొచ్చెలి వాపోవువాని నూరడించరే || ఇట్టి  || 

ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని

చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి

అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన

తప్పకుండ బెట్టె (బట్టి) వాని తలకెత్తరే || ఇట్టి  || 


Discover more from సింధు సిరులు

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *