రాగం : జంజుటి రాగం
తాళం : ఆదితాళం
Composer: అన్నమాచార్య కీర్తన
Language: తెలుగు
పల్లవి:
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని || వేడు||
చరణం: 1
ఆమటి మ్రొక్కుల వాడే ఆది దేవుడే
వాడు తోమని పళ్యాల వాడే దురిత దూర్యుడే || వేడు||
చరణం: 2
వడ్డీ కాసుల వాడు వనజనాభుడే
పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే ||వేడు||
చరణం: 3
ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
వాడు అలమేల్మంగా శ్రీ వేంకటాద్రి నాథుడే ||వేడు||
Discover more from సింధు సిరులు
Subscribe to get the latest posts sent to your email.



