రాగం : ఆనందభైరవి
తాళం : ఆదితాళం
Composer: అన్నమయ్య
Language: తెలుగు
ఆరోహణ : స గ1 రి2 గ1 మ1 ప ద2 ప స
అవరోహణ : స ని1 ద2 ప మ1 గ1 రి2 స
పల్లవి:
ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని
పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే
చరణం: 1
గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన
చేమ పూవు కడియాల చేయి పెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార
వేమరు వాపోవు వాని వెడ్డు వెట్టరే || ఇట్టి ||
చరణం: 2
ముచ్చువలె వచ్చి తన ముంగ మురువుల చేయి
తచ్చెడి పెరుగులోన తగవెట్టి
నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే || ఇట్టి ||
చరణం: 3
ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని
చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన
తప్పకుండ బెట్టె (బట్టి) వాని తలకెత్తరే || ఇట్టి ||
Discover more from సింధు సిరులు
Subscribe to get the latest posts sent to your email.


