Kanjadalayathakshi | కంజదళాయతాక్షీ కామాక్షీ | Mutthu Swamy Deekshithar

రాగం : కమలా మనోహరి
తాళం : ఆది తాళం
Composer: ముత్తుస్వామి దీక్షితార్
Language: తెలుగు
ఆరోహణ: స గ2 మ1 ప ని2 స
అవరోహణ: స ని2 ద1 ప మ1 గ2 స

పల్లవి:

కంజదళాయతాక్షీ కామాక్షీ

కమలా మనోహరి త్రిపురసుందరి

అను పల్లవి:

కుంజర గమనే మణిమండిత

మంజుల చరణే మామవ శివ

పంజరశుకి పంకజముఖి గురుగుహ

రంజని దురిత భంజని నిరంజని ||కంజదళాయతాక్షీ||

చరణం:

రాకా శశివదనే సురదనే

రక్షిత మదనే రత్న సదనే

శ్రీకాంచన వసనే సురసనే

శ్రీకాంచన వసనే సురసనే

శృంగారాశ్రయ మంద హసనే

ఏకానేకాక్షరి భువనేశ్వరి

ఏకానందామృత ఝరి భాస్వరి

ఏకాగ్ర మనోలయకరి శ్రీకరి

ఏకామ్రేశ గృహేశ్వరి శంకరి ||కంజదళాయతాక్షీ|| (ఏకానే)

ముక్తాయి: 

., స ని ద ప మ గ మ ప ని ద ప మ గ
సా, స ని ద ప ని స స గ స గ మ ప ని
సా, స ని స గ స మ గ స ని ద ప ని ని
సా, స ని ద ప మ గ స ని స గ మ ప ని ||కంజదళాయతాక్షీ||


Discover more from సింధు సిరులు

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *