
రాగం : నాట
తాళం : ఆది తాళం
Composer: పులియూర్ శ్రీ దురై స్వామి అయ్యర్
Language: సంస్కృతం
ఆరోహణ : స రి3 గ2 మ1 ప ద3 ని2 స
అవరోహణ : స ని2 ప మ1 రి3 స
పల్లవి:
సరసీరుహాసనా ప్రియే అంబ
సదా వీణా గానప్రియే
సదానంద హృదయే మహిసదయే ||సరసీ||
అను పల్లవి:
శరణాగతమ్…
శరణాగతం… అంబ
శరణాగతం.. మామవ మంజుల శరణకిసలయే
సమ్మోదితే కవి జన హృదయే
సరోజ నిలయే మణి వలయే ||సరసీ||
చరణం:
సరసీరుహాక్షి యుగళే అంబ
శరణాగత దీన వత్సలే
శరదిందు సుందర వదనే విమలే
సరస్వతీ….
సరస్వతీ…. అంబ
సరస్వతీ.. సతి దేశిక నుత గుణజాలే
సతతం విద్యాలోలే సదా సుశీలే
సామద కుంభ స్తన యుగళే ధవళే
సకల సా..మ్రాజ్య ప్రదకర ధృత పుస్తక జాలే ||సరసీ||
Meaning: కమలాసనుడైన చతుర్ముఖ బ్రహ్మకు ప్రియమైన అమ్మా సరస్వతీ! ఎల్లప్పుడూ వీణా గానమంటే ఇష్టపడే, సదా ఆనందంతో
నిండిన హృదయము కలిగి, ఈ భూమిపై అనుగ్రహము కలిగిన తల్లీ! చిగురులవలె మృదువైన చరణములు గలదానవు! కవిజనుల హృదయాలకు ఆనందం కలిగించే తల్లివి! కమలములో స్థిరమై యున్న దానవు!మాకు నీవే శరణం. కలువలవంటి కన్నులు కలిగిన తల్లీ! నీవు శరణన్న దీనులపై వాత్సల్యము కలిగిన అమ్మవు. శరదృతువులో చంద్రుని వంటి సుందరమైన ముఖము కలిగిన దానవు, నిర్మలమైన తల్లివి. ఓ సరస్వతీ! ఉత్తమమైన స్త్రీవి నీవు! పుణ్యాత్ములచే పొగడబడిన గుణములకు నెలవు నీవు! ఎల్లప్పుడూ విద్యలలో నిమగ్నమైయుందువు, నిరంతరం సద్గుణ సంపన్నవు. సకల విద్యలను పూర్ణమైన స్తనములలో కలిగిన అమ్మవు, తెల్లని వస్త్రములు ధరించి, చేతిలో పుస్తకములు కలిగి సమస్త భోగములు ప్రసాదించే అమ్మవు నీవు! నీవే మాకు శరణము.
Discover more from సింధు సిరులు
Subscribe to get the latest posts sent to your email.



