Saroja Dala Nethri | Shyama Sasthri

రాగం : శంకరాభరణం 
తాళం : ఆది తాళం
Composer: శ్యామశాస్త్రి 
Language: తెలుగు 
ఆరోహణ : స రి2 గ2 మ1 ప ద2 ని2 స 
అవరోహణ : స ని2 ద2 ప మ1 గ2 రి2 స 

పల్లవి:

సరోజ దళ నేత్రీ హిమగిరి పుత్రీ 

నీ పదాంబుజములే 

సదా నమ్మినానమ్మా శుభమిమ్మా 

శ్రీ మీనాక్షమ్మా ||సరోజ|| |

అను పల్లవి:

పరాకు సేయకు వరదాయకి నీ

వలె దైవము లోకములో గలదా 

పురాణీ శుక పాణీ మధుకర వేణీ 

సదా శివునికి రాణీ ||సరోజ|| 

చరణం:

సామగాన వినోదినీ గుణ

ధామ శ్యామకృష్ణ వినుత శుక 

శ్యామలా దేవి నీవే గతి రతి 

కామ్య కామదా కావవే నన్ను ||సరోజ|| 


Discover more from సింధు సిరులు

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *