Navadurga Swaroopini | నవదుర్గా స్వరూపిణీ | Samavedam

రాగం : పంతువరాళి 
తాళం : త్రిశ్ర ఆదితాళం 
Composer: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ
Language: తెలుగు 
ఆరోహణ : స రి1 గ2 మ2 ప ద1 ని1 స 
అవరోహణ : స ని2 ద1 ప మ2 గ2 రి1 స

ప్రథమం శైలపుత్రీత్రి – ద్వితీయం బ్రహ్మచారిణీ

తృతీయం చంద్రఘంటేతి – కూష్మాండేతి చతుర్ధకం 

పంచమం స్కందమాతేతి  – షష్ఠం కాత్యాయనీతిచ 

సప్తమం కాళరాత్రీత్రి – మహాగౌరీతిచ అష్టమం 

నవమం సిద్ధిదాత్రీచ – నవదుర్గాః ప్రకీర్తితాః ||

పల్లవి:

నవదుర్గా స్వరూపిణీ నవ నవ లావణ్య ధునీ 

నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా 

జగజ్జననీ జగన్మాతా జగదీశ్వరి పరమేశ్వరి 

చరణం: 1

త్రిలోకముల వెలిగించే త్రిపుర సుందరి

చతుర్వేద రూపిణీ జననీ గాయత్రి 

ఆయువిచ్చు ప్రాణదాత్రి అమ్మా అన్నపూర్ణ

మహిత వీర యోగమూర్తి మహిషాసుర మర్దిని 

అఖిలలోక ధారిణివై అవతరించు ఆదిశక్తి 

నీ కరుణల కలిమిచాలు అదేకదా ముక్తి     || నవదుర్గా స్వరూపిణి ||

చరణం: 2

కాలమ్మును నియమించే శ్రీ మహాకాళికా

వాగ్బుద్ధి జ్ఞానమయి హేమహాసరస్వతి

సంపదలకు సాకారము జననీ మహాలక్ష్మి

జగముల శాసించి బ్రోచు రాజరాజేశ్వరి

లాలిత్యమునకు నెలవుగ రాజిల్లే లలితాంబ

పదములకడ సుతుడనమ్మ పాలించుమమ్మ || నవదుర్గ స్వరూపిణి ||

https://youtu.be/w3sYcGuOirI?si=SMhwOkuTWB6TyVeu


Discover more from సింధు సిరులు

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *